డేటా చోరీ కేసులో అరెస్టుకు రంగం సిద్ధం..?

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ అరెస్టుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేశారు. తమ ముందు విచారణకు [more]

Update: 2019-03-05 13:46 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ అరెస్టుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేశారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు 24 గంటల సమయం ఇస్తూ నిన్న ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువు ముగిసినా కూడా ఆయన స్పందించకపోవడంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అశోక్ ఉన్నాడని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఇక, ఇవాళ మరోసారి సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఇక, ఇదే సంస్థపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుపై హైదరాబాద్ పోలీసులూ విచారణ ప్రారంభించారు.

Tags:    

Similar News