నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు [more]

Update: 2021-03-30 01:18 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ తరుపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, బీజేపీ, జనసేన అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ లు నామినేషన్లు దాఖలు చేశారు. నాగార్జున సాగర్ లో నేడు ప్రధాన పార్టీ అభ్యర్థులు జానారెడ్డి, నోముల భగత్ లు నామినేషన్లు వేయనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Tags:    

Similar News