డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. మైత్రీ [more]
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. మైత్రీ [more]
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది ట్యాగ్ లైన్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. రేపు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేస్తున్నారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యంలో విడుదలైన సాంగ్ కూడా బాగుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.