విడాకులిప్పించండి మహా ప్రభో - మాజీ సీఎం వేడుకోలు

తన భార్య పెడుతున్న హింసను తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన విన్నపాన్ని... ఢల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఆమె వేధిస్తోందనడాని తగిన ఆధారాల్లేవని, కలిసి బతకాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆ మాజీ ముఖ్యమంత్రి మరెవరో కాదు.. కశ్మీర్‌లో ప్రముఖ పార్టీ నేషనల్‌ కాన్ఫÛరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా. ఆయన తండ్రి కూడా ఫరూక్‌ చాలాకాలం కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.;

Update: 2023-12-12 15:24 GMT
Jammu and Kashmir, Omar Abdullah, National Conference, national news, india

Omar Abdullah

  • whatsapp icon

భార్య వేధిస్తోందంటూ కేసు  పెట్టిన ఒమర్ అబ్దుల్లా

ఆదారాల్లేవంటూ కేసు కొట్టేసిన ఢిల్లీ హైకోర్ట్ 

తన భార్య పెడుతున్న హింసను తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన విన్నపాన్ని... ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఆమె వేధిస్తోందనడానికి  తగిన ఆధారాల్లేవని, ఇద్దరూ కలిసి బతకాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆ మాజీ ముఖ్యమంత్రి మరెవరో కాదు.. కశ్మీర్‌లో ప్రముఖ పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా. ఆయన తండ్రి ఫరూక్‌  అబ్దుల్లా కూడా చాలాకాలం కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

తన భార్య పాయల్‌ అబ్దుల్లా తనను హింసిస్తోందని ట్రయల్‌ కోర్టులో ఒమర్‌ విడాకులకు అప్లయ్‌ చేశారు. 1994లో వారిద్దరికీ పెళ్లయింది. ఆ జంటకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. తమ మధ్య దూరం పెరిగిందని, 2007 నుంచి దాంపత్య సంబంధం కూడా లేదని ఒమర్‌ కోర్టుకు విన్నవించారు. 2009 నుంచి వారిద్దరూ విడిగా ఉంటున్నారు. పాయల్‌, ఒమర్‌ను వేధిస్తోందనడానికితగిన ఆధారాల్లేవని 2016లో ట్రయల్‌ కోర్టు విడాకులను తిరస్కరించింది.

దీంతో ఒమర్‌ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ, ఒమర్‌ పాయల్‌ జంటకు విడాకులు మంజూరు చేయలేమని ఢిల్లీ హైకోర్టు కూడా మంగళవారం తేల్చి చెప్పింది. 

Tags:    

Similar News