ఆ ఘటనపై రాజ్యసభలో….

రాజ్యసభలో శంషాబాద్ లో హత్యకు గురైన దిశ ఘటనపై చర్చ జరిగింది. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దారుణ ఘటనను ఖండించారు. దిశ హత్య జరిగిన తీరు [more]

Update: 2019-12-02 06:22 GMT

రాజ్యసభలో శంషాబాద్ లో హత్యకు గురైన దిశ ఘటనపై చర్చ జరిగింది. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దారుణ ఘటనను ఖండించారు. దిశ హత్య జరిగిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. చట్టాలను మరింత కఠినతరం చేస్తేనే మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. సత్వరం న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలపై చర్చ ఇదే చివరిది కావాలన్నారు. నేషనల్ హైవేలపై మద్యం దుకాణాలను నియంత్రించాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పెట్రోలింగ్ ను మరింత తీవ్రతరం చేసి మహిళల రక్షణకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Tags:    

Similar News