జగన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయంతో?

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ధర్మాన అనేక అంశాలను స్పృశించారు. చంద్రబాబు ఏం [more]

Update: 2020-01-20 14:07 GMT

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ధర్మాన అనేక అంశాలను స్పృశించారు. చంద్రబాబు ఏం రాజధాని మీ రాజధాని అంటూ వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల మనోభావాలను చంద్రబాబు కాలరాశారన్నారు. అమరావతి అభివృద్ధిని అంతటినీ సింగపూర్ కు అప్పగించారన్నారు ధర్మాన. కమిటీ రిపోర్ట్ లను భోగిమంటల్లో వేస్తారా? అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం చేస్తామంటుంటే వెనక నుంచి అడ్డుకుంటున్నారన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తే సమస్యలు తప్పవన్నరాు. జగన్ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. జగన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల వల్లనే తమ ప్రాంతంలో వెలుగులు కన్పిస్తున్నాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే జగన్ చేశారన్నారు. వంశధార ప్రాజెక్టుకు 19వ దశకంలో పునాదులు పడితే ఇంతవరకూ పూర్తి కాలేదన్నారు. చంద్రబాబు చేసిన పని అనైతిక పని అని ధర్మాన ఎండగట్టారు. ఇది రాజ్యాంగ బద్ధమైన నిర్ణయాన్ని అందరూ ఆమోదించాలన్నారు. రాజధాని దూరం విషయం తీసుకోకూడదని శివరామకృష్ణన్ చెప్పిందన్నారు. జగన్ ఇడుపులపాయలో పెట్టి ఉంటే అది స్వార్థం కోసం అనుకోవచ్చని, విశాఖలో పెడితే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.

Tags:    

Similar News