భారీగా జనం.. అటువైపు పోవద్దు..!
ఆదివారం సాయంత్య్రం ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం రావద్దని గణేష్ మంటప నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం కావడంతో భాగ్యనగర వాసులంతా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోడానికి క్యూ కడుతున్నారు.
ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం రావద్దని గణేష్ మంటప నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో భాగ్యనగర వాసులంతా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోడానికి క్యూ కడుతున్నారు. గణేష్ నిమజ్జనాలకు టైం అవుతుండటంతో ఊళ్లో ‘పెద్ద’ గణేష్‌లకు తాకిడి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఖైరతాబాద్ వినాయకుడి కోసం భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి వినాయక మంటపం దారులన్నీ కిక్కిరిసి పోయాయి. అధిక శాతం భక్తులు వినాయక విగ్రహం ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో విగ్రహం వద్ద రద్దీ బాగా ఎక్కువైపోతోంది. ఈ హడావుడిలో పిల్లలు తప్పిపోతున్నారని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందని జేబు దొంగలు హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారు. భక్తుల ఫోన్లు, పర్సులు మాయం చేస్తున్నారు. వృద్ధులు స్పృహ తప్పిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని, కాబట్టి భక్తులు జాగ్రత్తగా ఉండాలని మంటప నిర్వాహకులు సూచిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని... దర్శనం కోసం వచ్చినా, దూరం నుంచే వినాయకుని చూసి వెనుతిరగాలని భక్తులకు పోలీసులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.