అన్న అధికారంలో ఉన్నా చెల్లికి న్యాయం జరగడం లేదు

ఢిల్లీలో సిబీఐ అధికారులను దివంగత వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కలిశారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో సునీత మాట్లడారు. తన తండ్రి హత్య తర్వాత దర్యాప్తు [more]

Update: 2021-04-03 01:00 GMT

ఢిల్లీలో సిబీఐ అధికారులను దివంగత వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కలిశారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో సునీత మాట్లడారు. తన తండ్రి హత్య తర్వాత దర్యాప్తు అధికారులతో మాట్లాడానన్నారు. రెండేళ్లుగా వివేకా హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారని సునీత అన్నారు. ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు తెలియలేదని, మాజీ సీఎం సోదరుడి హత్య కేసులో నిందితులను పట్టుకోలేక పోవడం దారుణమని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు విచారణ సరిగ్గా జరగడం లేదన్నారు. ఎంతకాలం న్యాయం కోసం వేచి చూడాలని సునీత ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తమకు న్యాయం జరగలేదని సునీత చెప్పారు. వివేకాది ముమ్మాటికీ హత్యేనని వైద్యురాలిగా చెబుతున్నానని అన్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, దోషులను త్వరగా శిక్షించాలని సీబీఐ, కేంద్రాన్ని సునీత కోరారు. అన్న అధికారంలో వున్నాసరే ఈ చెల్లికి న్యాయం జరగడం లేదని సునీత ఆవేదన వ్యకత్ం చేశారు. సొంత చెల్లికి న్యాయం లేదు ఇక సుగాలి ప్రీతి లాంటి చెల్లికి ఏం న్యాయం చేస్తాడని సునీత ప్రశ్నించారు. ఎంత ఆలస్యంగా విచారణ జరిగితే… న్యాయం అంత దూరం అయినట్లేనని సునీత అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News