బ్రేకింగ్ : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. మూడు రౌండ్లలో మెజారిటీ మార్క్ దాటడంతో ఆమె రాష్ట్రపతి గా ఎన్నికయినట్లే.

Update: 2022-07-21 14:37 GMT

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రమాణస్వకారం చేయనున్నారు. తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. లెక్కించిన మూడు రౌండ్లలోనూ ద్రౌపది ముర్ముకు భారీ మెజారిటీ లభించింది. 5,77,777 విలవుైన ఓట్లను ద్రౌపది ముర్ము సాధించారు.

అంచనాలకు మించి....
ఎన్డీఏ అంచనాకు మించి ద్రౌపది ముర్ముకు ఓట్లు లభించాయి. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ద్రౌపది ముర్ముకు అత్యధిక ఓట్లు లభించాయి. ఎన్డీఏలోని పక్షాలతో పాటు విపక్షాలకు చెందని అనేక పార్టీలు మద్దతు పలకడం, చివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతోనే ద్రౌపది ముర్ము అఖండ విజయం సాధించారు. మూడు రౌండ్లలో మెజారిటీ మార్క్ దాటడంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గా ఎన్నికయినట్లే. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.


Tags:    

Similar News