ప్రారంభమయిన దుబ్బాక ఎన్నికల పోలింగ్

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక [more]

Update: 2020-11-03 01:57 GMT

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మాస్క్, గ్లౌజ్ లు లేకుంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించడం లేదు. మొత్తం 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతమ్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు పోటీ చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News