బ్రేకింగ్ : నవంబరు 3వ తేదీ దుబ్బాక ఉప ఎన్నిక

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 3వ తేదీన దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. పదో తేదీన కౌటింగ్ జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికకు [more]

Update: 2020-09-29 08:27 GMT

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 3వ తేదీన దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. పదో తేదీన కౌటింగ్ జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబరు 9వ తేదీ షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు చివరి గడువు అక్టోబరు 16వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వతేదీ. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికతో దేశంలోని 56 నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందడంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమయింది.

Tags:    

Similar News