అలక పాన్పు దిగని మాజీ హోంమంత్రి.. సజ్జలను కలిసేందుకు నిరాకరణ
ఆదివారం రాత్రి ఎంపీ మోపిదెవి వెంకటరమణ ఆమెను బుజ్జగించేందుకు ఇంటికి వెళ్లినా.. ఏం ఫలితం లేదు. సామాజిక సమీకరణాల..
గుంటూరు : ఏపీ రెండో విడత కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే సుచరిత ప్రభుత్వంపై అలకబూనిన విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై అలగడంతో.. స్వయంగా సీఎం జగనే వారితో మాట్లాడి సర్దిచెప్పడంతో.. తామంతా పదవులు లేకున్నా జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. కానీ సుచరిత మాత్రం ఇంకా అలకపాన్పు దిగడంలేదు.
ఆదివారం రాత్రి ఎంపీ మోపిదెవి వెంకటరమణ ఆమెను బుజ్జగించేందుకు ఇంటికి వెళ్లినా.. ఏం ఫలితం లేదు. సామాజిక సమీకరణాల వల్లే కేబినెట్‌లో చోటు కల్పించలేకపోయామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు ఫోన్ చేసి, రమ్మని చెప్పారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆమె వెళ్లలేదని సన్నిహితులు చెప్పడం గమనార్హం. సజ్జల, మోపిదేవి మినహా అధిష్ఠానం నుంచి సుచరితతో ఎవరూ మాట్లాడలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో సీఎం జగన్ ఆమెపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.