డేటా చోరీపై టీడీపీ డమ్మీ ట్వీట్లు..?

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి మంత్రి నారా [more]

Update: 2019-03-04 14:29 GMT

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ తో కలిసి వైసీపీ తమ డేటానే దొంగలించిందని ఆయన ఉల్టా ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన #TSGovtStealsData అని ఓ హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు. వందలాదిగా ఇదే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు మొదలయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ డేటాను దొంగలించిందని ఆరోపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా డమ్మీ వ్యవహారమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా బయటపెట్టారు.

ఇతర రాష్ట్రాల వారి ట్వీట్లు

ఇవన్నీ డమ్మీ ట్వీట్లుగా తేల్చారు. ఇదే హ్యాష్ ట్యాగ్ తో చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఈ హాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేసే వారు చాలా మందికి తెలుగు కూడా రాదు. పైగా వీరు తెలుగులోనూ ట్వీట్ చేస్తున్నారు. చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. వీరికి ఏపీతో కానీ తెలంగాణతో కానీ సంబంధం కూడా లేదు. సరే, జాతీయ మీడియాలో పెద్ద ప్రచారం జరిగితే తెలిసింది అనే అవకాశం కూడా లేదు. ఇప్పటివరకూ ఈ కేసు వ్యవహారం జాతీయ మీడియాకు ఎక్కలేదు. మరి ఈ ట్వీట్ల తతంగం ఏంటో తేలాలి. తెలంగాణ డిజిటల్ మీడియా టీమ్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి మొత్తం కూపీ లాగి బయటపెట్టింది.

Tags:    

Similar News