పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు కేరళను తలపిస్తున్నాయి. జంగారెడ్డి గూడెం సమీపంలోని ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నల్లచర్ల, నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఎర్రకాలువ జలాశయానికి ఉన్న నాలుగు గేట్లను ఎత్తి 13,000 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. దీంతో ఈ నీరు సమీప గ్రామాల్లోకి పోటెత్తింది. నల్లజర్ల మండలం చోడవరం గ్రామం పూర్తిగా నీటమునిగి నదిని తలపిస్తోంది. వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. అయితే, వరద ఉధృతిని అంచనా వేయలేని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి.