వీవీఐపీలకు బంగారు, వెండిపాత్రల్లో భోజనాలు

జి 20 సమావేశాల కోసందేశరాజధాని ఢిల్లీలో ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి భారతీయత, సంస్కృతి, సంప్రదాయలు, వైభవాలను మేళవించి లంచ్, డిన్నర్ లను ఏర్పాటు చేశారు.

Update: 2023-09-08 05:04 GMT

వీవీఐపీలకు బంగారు, వెండిపాత్రల్లో భోజనాలు

జి 20 సమావేశాల కోసందేశరాజధాని ఢిల్లీలో ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి భారతీయత, సంస్కృతి, సంప్రదాయలు, వైభవాలను మేళవించి లంచ్, డిన్నర్ లను ఏర్పాటు చేశారు. లక్సరీ హోటళ్లలో బంగారు, వెండి ప్లేట్లలో వారికి వడ్డించనున్నారు. ఇందుకోసం మంగళవారమే ట్రయల్స్ వేశారు. భోజన టేబుళ్లపై స్టీలు, ఇత్తడితో చేసిన ప్లేట్లు, గ్లాసులకు బంగారు, వెండి కోటింగ్ వేశారు. జైపూర్ తయారైన ఈ వస్తువులకు చేతిపని లేదా సెమిమిషన్లతో అందమైన నగిషీలు చెక్కారు. భారతదేశ వారసత్వం సంపద ప్రతిబింబించేలా జైపూర్ కు చెందిన 200 మంది కళాకారులు కష్టించి 15,000 వెండి పాత్రల అంచులను నగిషీలతో సిద్దం చేశారు.

సంప్రదాయం, ఆధునిక సమ్మిళితం

భారతదేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా బంగారు, వెండి పాత్రలతో ప్రపంచ నేతలకు అతిధి మర్యాదలు చేయనున్నారు. పూర్వకాలం మహరాజులు బంగారు, వెండి పాత్రల్లో భోజనం చేయడం ఆరోగ్యప్రదమైనవిగా భావించేవారు. భారత సంప్రదాయం ప్రకారం వారికి పూలదండలు వేసి ఆహ్వానం పలుకుతారు. భోజన టేబుళ్లను పూలతో అలంకరించారు.మన దేశ పక్షి వెండితో చేసిన నెమలి, పువ్వులను అలంకరించారు.

Tags:    

Similar News