ఏపీ ఫారెస్ట్ అధికారి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫారెస్ట్ ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోని నాగోలులో రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 1987 బ్యాచ్ కుచెందిన రమణమూర్తి కొంతకాలం నుంచి తీవ్రమైన మానసిక [more]

Update: 2020-10-01 06:13 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫారెస్ట్ ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోని నాగోలులో రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 1987 బ్యాచ్ కుచెందిన రమణమూర్తి కొంతకాలం నుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. ఇవాళ తెల్లవారు జామున నాగోల్ లోని స్వగృహ అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రమణమూర్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రమణ మూర్తి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News