కన్నా పార్టీని వీడింది అందుకేనట
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు ముఖ్యఅనుచరులతో సమావేశమైన కన్నా ఈ మేరకు ప్రకటించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా కమలం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీపైన కన్నా బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు పైనే ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
టీడీపీతో పొత్తు...
ప్రధానంగా సోము వీర్రాజుతో పాటు జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలు టీడీపీతో కలసి పనిచేయడానికి ఇష్టపడకపోవడంతోనే కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసినట్లు తెలిసింది. అధినాయకత్వం కూడా టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడంతోనే ఆయన ఇక ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుందని భావించి, తన రాజకీయ భవిష్యత్ ను మెరుగుపర్చుకోవడానికి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు.
వైసీపీని ఓడించేందుకు...
టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తే వైసీపీని ఓడించవచ్చని కన్నా లక్ష్మీనారాయణ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ పార్టీ హైకమాండ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడం, ఇటు జనసేనను వదిలి ఒంటరిగా పోట ీచేసేందుకైనా బీజేపీ సిద్ధమవుతుండటంతో కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన జనసేనలో చేరే అవకాశాలుఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీలో చేరే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమంటున్నారు.