నల్లారి ఎంట్రీ రాంగ్ టైమింగా?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతున్నారంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతున్నారంటున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినా ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. త్వరలోనే చేరతారని మాత్రం ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆయన చేరికతో పార్టీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏదైనా ఉంటుందా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకోవడానికి నల్లారి దగ్గర దారి అనుకున్న అధినాయకత్వం ఆయనను పార్టీలోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. అనిపిస్తుంది. కానీ రెండు రాష్ట్రాల్లో అది సాధ్యం అయ్యే పని కాదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో నష్టమే తప్ప కొత్తగా వచ్చే ఓట్లు కూడా పెద్దగా ఉండబోవన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా చేసినంత మాత్రాన ప్రజల్లో బలం ఉంటుందా? అంటే నల్లారి గత పదేళ్లుగా ప్రజలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్న వెనువెంటనే వినిపిస్తుంది.
ఏం ఉపయోగం?