తెలంగాణలో వలసలు మొదలు.. బీజేపీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత
జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనిపై ఆయన నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు బీజేపీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనిపై ఆయన నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు.
అసంతృప్తిగా...
ఇటీవల కేసీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. అక్కడ అసంతృప్త నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవిలను కలసి మంతనాలు చేసి వచ్చారు. ఖమ్మం పర్యటన తర్వా కొల్హాపూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా వరస సమావేశాలను జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
వరస సమావేశాలతో.....
టీఆర్ఎస్ లో తనకు భవిష్యత్ లేదని జూపల్లి కృష్ణారావు భావిస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే వరస సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తాను ప్రజల కోసమే తీసుకుంటానని, 9 నెలల్లో ఏం జరుగుతుందో చూడాలని జూపల్లి కృష్ణారావు అన్నారు.