సింపతీ పనిచేయదని బాబుకు తెలియదా? ఉండవల్లి కామెంట్స్
జగన్ రెండేళ్ల పాలనలో అన్నింటా విఫలమయ్యారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
జగన్ రెండేళ్ల పాలనలో అన్నింటా విఫలమయ్యారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగ్ నివేదికపై జగన్ అసెంబ్లీలో చర్చించలేదన్నారు. ఎవరూ వ్యవహరించనట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఉండవల్లి ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. అవినీతి లేదని ఒక్కరైనా చెప్పగలరా? అని ఉండవల్లి ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకోవడంపై కూడా ఉండవల్లి చర్చించారు. బిల్లులో లోపాలున్నాయంటే ప్రభుత్వ అసమర్థత అని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి విచక్షణ లేదు...
వైసీపీ ప్రభుత్వానికి విచక్షణ లోపించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని ఉండవల్లి అన్నారు. పోలవరం పై జగన్ కనీసం కౌంటర్ కూడా వేసే పరిస్థితి కూడా లేదన్నారు. అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదన్నారు. ఎన్టీఆర్ కుమార్తె లపై ఎప్పుడూ తాను ఎలాంటి వార్తలు వినలేదున్నారు. చంద్రబాబు కూడా సభలో ఉండి మూడు రాజధానుల అంశంపై నిలదీయాలన్నారు. చంద్రబాబు ఏడుపు డ్రామా అని తాను అనుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు సానుభూతి పనిచేయదని ఆయనకు తెలియాదా? అని అన్నారు. నవీన్ పట్నాయక్ పై ఎలాంటి ఆరోపణలు లేనందునే ఆయన వరసగా గెలుస్తున్నారన్నారు.
సింపతీ అని అనుకోను....
చంద్రబాబుపై క్లేమోర్ మైన్ లు పేలినప్పుడు, ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుుడ ఆయన రాష్ట్రమంతటా తిరిగినా సానుభూతి పనిచేయలేదన్నారు ఉండవల్లి. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ జగన్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడే సానుభూతి పనిచేసిందన్నారు. చంద్రబాబు అంతగా ఆవేదన చెందాల్సిన అవసరం లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సానుభూతి కోసమే ఏడ్చారని తాను అనుకోవడం లేదని అన్నారు. అలా మాట్లాడిన వారి మానసికస్థితి సరిగా లేదని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చరిత్ర గురించి అందరికీ తెలుసునన్నారు. సీనియర్ నేత చంద్రబాబును వైసీపీ మంత్రులు దూషించడం సరికాదన్నారు. ప్రతిపక్షానికి గౌరవమివ్వాలని ఆయన కోరారు.
విపక్షం లేకుండా చేయాలనుకోవడం...
జగన్ కూడా 150 సీట్లు వచ్చాయని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని ఉండవల్లి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చూసి నేర్చుకోమని ఉండవల్లి సలహా ఇచ్చారు. చంద్రబాబుతో వైఎస్ మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేసేవారన్నారు. విపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. చంద్రబాబును జగన్ వెంటనే అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాలని ఉండవల్లి కోరారు. చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించడం రాష్ట్రానికి ఆరోగ్యకరమైన విషయం కాదన్నారు. భవిష్యత్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్.