బాదుడు షురూ.. భారత్ లో డీజిల్ పై రూ.25 పెంపు

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయని అనుకున్నారు. కానీ.. పార్లమెంటు సమావేశాలను దృష్టిలో పెట్టుకుని

Update: 2022-03-20 12:34 GMT

న్యూ ఢిల్లీ : అందరూ ఊహించిందే జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పైనా పడింది. భారత్ లో చమురు ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దాంతో భారత్ లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ పై రూ.25 పెంచినట్లు.. ప్రధాన చమురు సంస్థలు ప్రకటించారు. నవంబర్ 4వ తేదీ తర్వాత భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు భారత చమురు సంస్థలు. అప్పటి నుంచి నేటి వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయని అనుకున్నారు. కానీ.. పార్లమెంటు సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరడంతో.. భారత చమురు సంస్థలు డీజిల్ ధరపై రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా.. డీజిల్ టోకు ధర పెంచినా, రిటైల్ ధరలో మార్పేమీ లేదు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై త్వరలోనే సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత ధరలపై ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.


Tags:    

Similar News