ఆ ఎన్నికల విషయాన్ని ప్రధాని దృష్టికి గల్లా
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా వాయిదా వేయాలని తాను ప్రధాని మోదీని కోరినట్లు గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ [more]
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా వాయిదా వేయాలని తాను ప్రధాని మోదీని కోరినట్లు గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ [more]
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా వాయిదా వేయాలని తాను ప్రధాని మోదీని కోరినట్లు గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన కరోనా కాలంలో కూడా వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు వాడుకుంటున్నారని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజకీయాలు చేయడం తగదని గల్లా జయదేవ్ కోరారు. హైదరాబాద్ నుంచి విమర్శలు చేస్తున్నారని చంద్రబాబుపై మాట్లాడటం తగదని గల్లా జయదేవ్ ఫైర్ అయ్యారు. వచ్చే శనివారం అందరూ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారని, దీని తర్వాతనే లాక్ డౌన్ పై స్పష్టత వస్తుందని చెప్పారు. లాక్ డౌన్ కొనసాగించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని చెప్పారు.