ఏపీకి ఇంత అన్యాయమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్యాయం చేస్తుందని టీడీపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ అన్నారు. విభజన సమయంలోనే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. విభజనతో [more]

Update: 2021-03-16 01:01 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్యాయం చేస్తుందని టీడీపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ అన్నారు. విభజన సమయంలోనే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. విభజనతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీని ఏ విధంగా కూడా ఆదుకోవడం లేదని, విభజన హామీలను కూడా అమలు చేయడం లేదని గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులన్నీ ధనిక రాష్ట్రాలకే కేటాయిస్తున్నారన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయం కూడా బడ్జెట్ లో లేకపోవడం బాధాకరమని గల్లా జయదేవ్ అన్నారు.

Tags:    

Similar News