Breaking: టీడీపీలోకి వైసీపీ కీలక నేత
గన్నవరం వైసీపీ నేత దాసరి బాలవర్థన్‌రావు త్వరలో టీడీపీలో చేరనున్నారు
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎక్కువగా ఉండేటట్లే కనిపిస్తున్నాయి. వైసీపీ నేత దాసరి జైరమేష్ , దాసరి బాలవర్ధన్ రావులు టీడీపీలో చేరనున్నారని తెలిసింది. దాసరి బాలవర్థన్‌రావు వైసీపీలో ఉన్నారు. అయితే గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
గన్నవరంలో గతంలో...
ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్న ఆసక్తి నెలకొంది. గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న బచ్చుల అర్జునుడు ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈనేపథ్యంలో గన్నవరం నుంచి పోటీ చేయడానికి మరోసారి దాసరి సోదరులు సిద్ధమవుతున్నారని తెలిసింది. 1999, 2009లో దాసరి బాలవర్థన్ రావు గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.
చంద్రబాబుకు ఆహ్వానం...
ఆ తర్వాత గన్నవరం సీటును టీడీపీ అధినాయకత్వం వల్లభనేని వంశీకి ఇవ్వడంతో వారు రాజకీయంగా దూరమయ్యారు. తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈనేపథ్యంలో ఎన్టీఆర్, బసవతారకం కాంస్య విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు వారు ఆహ్వానం పలికారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా ఈ కార్యక్రమానికి పిలిచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారని దాసరి జై రమేష్ ప్రకటించారు. దీంతో వారు తిరిగి టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.