నా రాజీనామాను ఆమోదింప చేసుకుంటా

తన రాజీనామాను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింప చేసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం తేల్చి [more]

Update: 2021-03-09 06:00 GMT

తన రాజీనామాను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింప చేసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు. ఇప్పుడు జగన్ ముఖ్య పాత్ర పోషించాలన్నారు. అన్ని పార్టీలనూ కలుపుకుని ఉద్యమం చేయాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోలేకపోతే ఎప్పుడూ కాపాడుకోలేమన్నారు. అన్ని పార్టీలూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరకణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు రావడం లేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News