టిక్ టాక్ యూజర్లకు గుడ్ న్యూస్

టిక్ టాక్ యాప్ పై విధించిన నిషేదంపై స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. టిక్ టాక్ వల్ల పిల్లల్లో పెడధోరణి పెరుగుతోందని, అసభ్యకర కంటెంట్ ఈ [more]

Update: 2019-04-24 14:23 GMT

టిక్ టాక్ యాప్ పై విధించిన నిషేదంపై స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. టిక్ టాక్ వల్ల పిల్లల్లో పెడధోరణి పెరుగుతోందని, అసభ్యకర కంటెంట్ ఈ యాప్ ద్వారా వ్యాప్తి చెందుతోందని ఇటీవల మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు టిక్ టాక్ పై నిషేదం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ యాప్ ను తమ ప్లే స్టోర్ల నుంచి తొలగించాలని కేంద్రం గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. దీంతో టిక్ టాక్ యాప్ ను ఆ సంస్థలు తొలగించాయి. అయితే, మద్రాస్ హైకోర్టు తీర్పును టిక్ టాక్ సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్ కోర్టు గతంలో టిక్ టాక్ పై నిషేదం విధిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో టిక్ టాక్ యధావిధిగా కొనసాగనుంది.

Tags:    

Similar News