ఉద్యమ నేతగా నడిచి నేడు రాష్ట్రాన్నే నడిపిస్తూ

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నమస్కారమంటూ తెలుగులో తన ప్రసంగాన్ని గవర్నర్ ప్రారంభించారు. [more]

Update: 2020-03-06 06:09 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నమస్కారమంటూ తెలుగులో తన ప్రసంగాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఉద్యమ నేతగా ఎదిగి నేడు రాష్ట్రాన్నే కేసీఆర్ నడిపిస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. వ్యవసాయ రంగంలోనూ అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షతకు గురయిందన్నారు. అయితే ఆ దశ నుంచి బయపడిందని గవర్నర్ తెలిపారు. తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు దండగ అనే పరిస్థితి నుంచి పండగ అనుకునే పరిస్థితికి చేరుకుందన్నారు. వృద్ధాప్య పెన్షన్ల వయసు 57కు తగ్గించామన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్లు అందచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించామని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తితో…

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తుండటంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. రైతు బంధు పథకం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని గవర్నర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో విద్యుత్తు సంక్షోభాన్ని తెలంగాణ ఎదుర్కొనిందని, అయితే ఆ పరిస్థితులను నేడు అధిగమించామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్య నుంచి బయటపడుతూ వస్తున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. నకిలీ ఎరువులను సమర్థవంతంగా అరికట్టగలిగామని తెలిపారు. రైతు బీమా పథకం వ్యవసాయరంగానికి పూర్తి భరోసా ఇచ్చిందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇచ్చామన్నారు. ఆరు దశాబ్దాల తర్వాత తెలంగాణ కల సాకారమయిందని గవర్నర్ తెలిపారు.

Tags:    

Similar News