డాక్టర్లపై దాడి కేసు.. ప్రభుత్వం సీరియస్
గాంధీ ఆసుపత్రి వైద్యులపై జరిగిన దాడి పై ప్రభుత్వం సీరియస్ అయింది. కుత్బుల్లాపూర్ కు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగర పోలీసు కమిషనర్ [more]
గాంధీ ఆసుపత్రి వైద్యులపై జరిగిన దాడి పై ప్రభుత్వం సీరియస్ అయింది. కుత్బుల్లాపూర్ కు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగర పోలీసు కమిషనర్ [more]
గాంధీ ఆసుపత్రి వైద్యులపై జరిగిన దాడి పై ప్రభుత్వం సీరియస్ అయింది. కుత్బుల్లాపూర్ కు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్యులపై దాడిచేసిన వారిలో ఒకరు కరోనా పాజిటివ్ పేషెంట్ కావడంతో అతడిని వేరే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. తమకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని వారు కోరారు. డాక్టర్లపై దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.