రాజాసింగ్ కు భద్రత పెంపు… అందుకేనట
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. కొద్దిరోజుల క్రితం పట్టుబడిన టెర్రరిస్టుల నుంచి సేకరించిన సమాచారంలో రాజాసింగ్ పేరుంది. టెర్రరిస్టులతో ముప్పు ఉందని భావించిన [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. కొద్దిరోజుల క్రితం పట్టుబడిన టెర్రరిస్టుల నుంచి సేకరించిన సమాచారంలో రాజాసింగ్ పేరుంది. టెర్రరిస్టులతో ముప్పు ఉందని భావించిన [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. కొద్దిరోజుల క్రితం పట్టుబడిన టెర్రరిస్టుల నుంచి సేకరించిన సమాచారంలో రాజాసింగ్ పేరుంది. టెర్రరిస్టులతో ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం రాజాసింగ్ కు భద్రతను పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. రాజాసింగ్ కు అదనంగా మరో ఐదుగురితో భద్రతను ఏర్పాటు చేశారు. రాజాసింగ్ ఇకపై ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని పోలీసులు రాజాసింగ్ ను కోరారు. రాజాసింగ్ నివాసముంటున్న ప్రాంతాల్లో చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. దీంతో రాజాసింగ్ తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో తెలపాలని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్నవారి నుంచా? లేక టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉందో తెలియజేయాలని రాజాసింగ్ కోరారు. తాను రాష్ట్ర హోంమంత్రికి, కేంద్ర హోంమంత్రి కి ఈ విషయంపై లేఖ రాయనున్నట్లు రాజాసింగ్ వెల్లడించారు.