ఏబీ సస్పెన్షన్

ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పైన వేటు పడింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ [more]

Update: 2020-02-09 01:57 GMT

ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పైన వేటు పడింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్యూరిటీ పరికరాల కొనుగోలు పెద్దమొత్తంలో గోల్ మాల్ చేసిన ఆరోపణలపై సస్పెండ్ చేసినట్లు గా చీఫ్ సెక్రటరీ నీలం సహాని పేర్కొన్నారు. ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేస్తూ జీవో జారీ చేశారు. ఆలిండియా సర్వీసెస్ అధికారుల రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పరికరాల కొనుగోలులో…..

మరోవైపు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వెంకటేశ్వరరావు వ్యవహరించారన్న ఆరోపణలపై సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ నుంచి పెద్ద మొత్తంలో సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు వ్యవహారం సంబంధించి జరిగినట్లుగా వెల్లడించారు. మొత్తం ఏడు ఆరోపణలపై విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సస్పెన్షన్ పూర్తి అయ్యేవరకు విజయవాడ వదిలి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. అదే మాదిరిగా ఒకవేళ బయటికి వెళ్ళాలి అనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పారు . ఏబీ వెంకటేశ్వర రావు కుమారుడు ఆయనకు చెందిన ఆకాశం అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన కొనుగోళ్ల కు సంబంధించి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలపై విచారణ చేసింది ఏపీ ప్రభుత్వం.

Tags:    

Similar News