బ్రేకింగ్ : గవర్నర్ ఆదేశాలను పక్కన పెట్టి

కర్ణాటక శాసనసభలో గవర్నర్ వాజుబాయి వాలా విధించిన గడువు ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 1.30గంటలలోగా కుమారస్వామి బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ వాజూబాయి వాలా కోరినసంగతి తెలిసిందే. అయితే [more]

Update: 2019-07-19 08:22 GMT

కర్ణాటక శాసనసభలో గవర్నర్ వాజుబాయి వాలా విధించిన గడువు ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 1.30గంటలలోగా కుమారస్వామి బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ వాజూబాయి వాలా కోరినసంగతి తెలిసిందే. అయితే స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం విశ్వాసం పై చర్చ ముగియకుండా ఓటింగ్ జరపలేనని స్పష్టం చేశారు. తనను ఎవరూ ఇన్ ఫ్లూయిన్స్ చేయలేరని తెలిపారు. తనపై ఎవరి వత్తిడి పనిచేయదని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తనను గవర్నర్, సుప్రీంకోర్టు శాసించలేరని కూడా స్పీకర్ వ్యాఖ్యానించారు. స్పీకర్ రమేష్ కుమార్ గవర్నర్ వాజూబాయి వాలాను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. కర్ణాటక శాసనసభను స్పీకర్ మధ్యాహ్నం 3గంటలకు వాయిదా వేశారు.

Tags:    

Similar News