రాజ్ భవన్ కు చేరిన నిమ్మగడ్డ పంచాయతీ

గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీల [more]

Update: 2020-03-20 01:45 GMT

గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీల సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ లు గవర్నర్ నిన్న అర్థరాత్రి కలిశారు. గవర్నర్ ఆదేశం మేరకు వీరంతా రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కు రాసిన లేఖపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరిని అడిగినట్లు తెలిసింది. అలగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా గవర్నర్ ఆరా తీసినట్లు చెబుతున్నారు. అయితే తాము రమేష్ కుమార్ కు ఇప్పటికే భద్రత కల్పించామని, భద్రతను కూడా పెంచినట్లు అధికారులు గవర్నర్ కు వివరించారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో అదుపులోనే ఉన్నాయని గవర్నర్ కు వారు వివరించారు.

Tags:    

Similar News