క్రికెట్లో జంటిల్‌మెన్లూ ఉన్నారు!

సోమవారం నాటి శ్రీలంక బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో టైండ్‌ అవుట్‌ వివాదం రేగిన సంగతి ఈ వరల్డ్‌ కప్‌లో సంచలనంగా మారింది. మూడు నిముషాలు ఆలస్యంగా బ్యాటింగ్‌ ప్రారింభించినందుకు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఏంజెలో మాధ్యూస్‌ అనుకోని అవుట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. క్రికెట్‌ రూల్స్‌ను ఆసరాగా తీసుకుని బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ ఏంజెలోని అవుట్‌గా ప్రకటించాల్సిందేనని పట్టుబట్టాడు. షకీబ్‌లో కొరవడిన క్రీడాస్ఫూర్తి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Update: 2023-11-07 03:13 GMT

సోమవారం నాటి శ్రీలంక బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో టైండ్‌ అవుట్‌ వివాదం రేగిన సంగతి ఈ వరల్డ్‌ కప్‌లో సంచలనంగా మారింది. మూడు నిముషాలు ఆలస్యంగా బ్యాటింగ్‌ ప్రారంభించందుకు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఏంజెలో మాధ్యూస్‌ 'అవుట్'గా పెవిలియన్‌ బాట పట్టాడు. క్రికెట్‌ రూల్స్‌ను ఆసరాగా తీసుకుని బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌.. ఏంజెలోని అవుట్‌గా ప్రకటించాల్సిందేనని పట్టుబట్టాడు. షకీబ్‌లో కొరవడిన క్రీడాస్ఫూర్తి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ 'అవుట్‌' వివాదం ఇదే మొదటి సారి కాదు. 2007లో సౌరవ్‌ గంగూలీ కూడా టైండ్‌ అవుట్‌గా వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ క్రీడా స్ఫూర్తి వల్ల గంగూలీ బ్యాటింగ్‌ కొనసాగించాడు. నవంబర్‌ 2006 నుంచి జనవరి 2007 వరకూ టీం ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండె వికెట్లు కోల్పోయాక గంగూలీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ఆరు నిముషాలు ఆలస్యంగా క్రీజ్‌లో అడుగు పెట్టాడు.

అంపైర్లు క్రికెట్‌ రూల్స్‌ని ప్రస్తావించారు. ఈ విషయంపై ఫీల్డ్‌లో కాసేపు చర్చ కూడా నడిచింది. ఏం జరగబోతోందో అంటూ ప్రేక్షకులు టెన్షన్‌ పడ్డారు. కానీ సౌతాఫ్రికా కెప్టెన్‌ స్మిత్‌ గంగూలీ ‘ఆలస్యాన్ని’ లైట్‌ తీసుకున్నాడు. గంగూలీకి బ్యాటింగ్‌ కొనసాగించే అవకాశాన్ని ఇచ్చాడు. సోమవారం శ్రీలంక ఓ వికెట్‌ను కోల్పోతే, షకీబ్‌ తన విలువను కోల్పోయాడు. కానీ 2007లో స్మిత్‌ నిర్ణయం వాళ్ళ క్రికెట్‌ గెలిచింది. స్మిత్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.


Tags:    

Similar News