గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించే కార్యక్రమాన్ని పెట్టకుంది. ఇటీవల హైకోర్టు సైతం యరపతినేని అక్రమ మైనింగ్ నిజమేనని చెప్పడంతో వైసీపీ ఈ కార్యక్రమానికి పూనుకుంది. దీంతో ముందుగానే అలెర్ట్ అయిన ప్రభుత్వం పోలీసులను దింపింది. దీంతో పోలీసులు ఉదయమే ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నేతలు బొత్స సత్యనారాయణ, కాసు మహేష్ రెడ్డి, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతలు ఎవరినీ గురజాల నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. 144 సెక్షన్ విధించారు.