గవర్నర్ నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు
గవర్నర్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫిబ్రవరి 11 2020 కేశినేని నాని ప్రశ్నకు సమాధానం చెప్పామన్నారు. [more]
గవర్నర్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫిబ్రవరి 11 2020 కేశినేని నాని ప్రశ్నకు సమాధానం చెప్పామన్నారు. [more]
గవర్నర్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫిబ్రవరి 11 2020 కేశినేని నాని ప్రశ్నకు సమాధానం చెప్పామన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని చెప్పారని జీవీఎల్ అన్నారు. తాము పార్టీ పరంగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశామన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడానికి తాము అభ్యంతరం తెలపమని జీవీఎల్ చెప్పారు. కాకుంటే అమరావతిలో రైతులకు న్యాయం జరగాలని జీవీఎల్ కోరారు. గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని ఎంచుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తుందో చెప్పాలన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కు ఎలాంటి అధికారాలు లేవంటారని, విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవంటారని జీవీఎల్ ఎద్దేవా చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం విలువ నిస్తుందని చెప్పారు.