త్వరలో హార్ధిక్ పటేల్ వివాహం

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఉద్యమాన్ని నడిపించిన హార్ధిక్ పటేల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన చిన్ననాటి మిత్రురాలు కింజల్ పారిఖ్ తో ఈ [more]

Update: 2019-01-21 08:24 GMT

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఉద్యమాన్ని నడిపించిన హార్ధిక్ పటేల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన చిన్ననాటి మిత్రురాలు కింజల్ పారిఖ్ తో ఈ నెల 27న ఆయన వివాహం జరగనుంది. వారి కులదైవం ఆలయంలో నిరాడంబరంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరపనున్నట్లు హార్ధిక్ తండ్రి భరత్ పటేల్ మీడియాకు తెలిపారు. చిన్ననాటి నుంచి హార్ధిక్, కింజల్ కుటుంబాలు ఒకేచోట నివసించేవి. హార్ధిక్ సోదరి మోనికాతో కలిసి కంజల్ చదువుకునేది. దీంతో ఆమె తరచూ హార్ధిక్ నివాసానికి వస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో హార్ధిక్ తో పరిచయం.. స్నేహంగా మారి.. తర్వాత ప్రేమగా మారింది. దీంతో హార్ధిక్ జైల్లో ఉండగానే వీరి వివాహం నిశ్చయమైంది. 21 ఏళ్ల వయస్సులోనే పటేళ్లకు రిజర్వేషన్ల కోసం పెద్దఎత్తున ఉద్యమించి హార్ధిక్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News