వైఎస్ షర్మిల పార్టీ పై హరీశ్ రావు ఏమన్నారంటే?

ఎవరెవరో వచ్చి తెలంగాణపై ప్రేమ కురిపిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. పరోక్షంగా వైఎస్ షర్మిలపై హరీశ్ రావు విమర్శలు చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి బాగా [more]

;

Update: 2021-02-11 02:00 GMT

ఎవరెవరో వచ్చి తెలంగాణపై ప్రేమ కురిపిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. పరోక్షంగా వైఎస్ షర్మిలపై హరీశ్ రావు విమర్శలు చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి బాగా లేదని మొసలి కన్నీరు కారుస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలపై వారికి ఏమాత్రం అవగాహన ఉన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలుతెలంగాణలో అమలవుతున్నాయని హరీశ్ రావు అన్నారు.

Tags:    

Similar News