విస్తరణపై హరీశ్ స్పందన ఇదే….!!!
మంత్రి వర్గ విస్తరణపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తనలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు [more]
మంత్రి వర్గ విస్తరణపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తనలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు [more]
మంత్రి వర్గ విస్తరణపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తనలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏపని చెప్పినా చేసుకుపోతానన్నారు. తాను టీఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తానని మీడియాతో మంత్రి వర్గ విస్తరణ అనంతరం అన్నారు. తనకు మంత్రి దక్కలేదని, అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అనవసరంగా రాద్ధాంత చేయవద్దని కోరారు. ప్రమాణస్వీకారంచేసిన మంత్రులందరూ కేసీఆర్ కు మంచిపేరు తెస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తాను సైనికుడిలా టీఆర్ఎస్ కోసం పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజికవర్గ సమీకరణలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేశారన్నారు.