ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆందోళనలో రైతన్నలు
అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు పంట నష్టపోయి.. లబోదిబోమంటున్నారు. గురువారం ఉదయం నుంచి ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పండక్కి సొంతూళ్లకే వెళ్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : టీడీపీ నేత దారుణ హత్య.. రాజకీయ గొడవలే కారణమా ?
మరోవైపు అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరికోతలు పూర్తయినా.. కుప్పలు నూర్చకపోవడంతో.. వర్షానికి తడిచి ఒడ్డు నానిపోతోంది. మొక్క జొన్న, పత్తి, వరి, పండు మిర్చి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. సంక్రాంతి కొత్తబియ్యంతో పండుగ చేసుకోవాల్సిన రైతన్న కంట.. వర్షం కన్నీరు తెప్పిస్తోంది. మరోవైపు తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.