బ్రేకింగ్: ప్రభాస్ పై హైకోర్టు ఆశ్చర్యకర వ్యాఖ్యలు

ప్రభాస్ కి చెందిన రాయదుర్గం గెస్ట్ హౌజ్ సీజ్ చేసిన విషయమై విచారణ జరిపిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గెస్ట్ హౌజ్ ను సీజ్ [more]

Update: 2019-01-03 10:45 GMT

ప్రభాస్ కి చెందిన రాయదుర్గం గెస్ట్ హౌజ్ సీజ్ చేసిన విషయమై విచారణ జరిపిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ప్రభాస్ కి అనుకూలంగా తీర్పు ఇస్తే మిగతా కబ్జాదారులు కూడా అర్హులవుతారని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ ను కబ్జాదారుడని లాయర్ అనగా… హైకోర్టు అభ్యంతరం తెలిపింది. రీల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి రియల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొని ఉండదరని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌజ్ కట్టుకున్నారని ఆయన తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News