జగన్ కు మరో షాకిచ్చిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గెజిట్ నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజధాని [more]
;
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గెజిట్ నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజధాని [more]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గెజిట్ నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజధాని ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందని పిటిషన్ తరుపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. జూన్ 17న తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.