మరణించిన వారికీ కరోనా పరీక్షలు.. హైకోర్టు ఆదేశం
తెలంగాణలో చనిపోతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది . చనిపోయిన వారికి మృతదేహాలకు పరీక్షలు నిర్వహించ వద్దంటూ గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. [more]
;
తెలంగాణలో చనిపోతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది . చనిపోయిన వారికి మృతదేహాలకు పరీక్షలు నిర్వహించ వద్దంటూ గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. [more]
తెలంగాణలో చనిపోతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది . చనిపోయిన వారికి మృతదేహాలకు పరీక్షలు నిర్వహించ వద్దంటూ గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఇద్దరు వ్యక్తులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిటిషన్లను హైకోర్టు విచారణ జరిపింది. ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారం మృతదేహాలకు కు కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అంతేకాకుండా డబ్ల్యుహెచ్ఓ చెప్తున్న నిబంధనలను కూడా తు.చ తప్పకుండా పాటించాలని ఆదేశించింది . కరోనా పరీక్షలపై ప్రభుత్వ విధానంపై హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా జిల్లా కేంద్రాలు కోవిడ్ చికిత్స పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా తెలిపింది. కరోనా పరీక్షలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై న సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది . ఈనెల 26వ తేదీన వరకు స్పష్టమైన నివేదిక అందించాలని తెలంగాణ సర్కార్ ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది.