సమ్మె పై హైకోర్టు సీరియస్
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని కోర్టు ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. అయితే సర్కార్ ఇప్పటి వరకు ఎండీని నియమించలేదు. [more]
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని కోర్టు ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. అయితే సర్కార్ ఇప్పటి వరకు ఎండీని నియమించలేదు. [more]
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని కోర్టు ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. అయితే సర్కార్ ఇప్పటి వరకు ఎండీని నియమించలేదు. కార్మికులను చర్చలకు పిలవలేదు. దీంతో తెలంగాణ హైకోర్టు ఇవ్వాళ ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టింది. ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎండీని నియమిస్తే సమస్య పరిష్కారం కాదని సర్కార్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సమర్థవంతమైన ఇన్ ఛార్జ్ ఉన్నారని పేర్కొంది. సమర్థవంతమైన అధికారి ఉంటే ఆయననే ఎందుకు పూర్తస్థాయి ఎండీగా నియమించలేదని ప్రశ్నించింది. రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు తిరగబడితే ఏం చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆందోళనలు ఉధృతంకాకముందే సమ్మె పరిష్కారానికి ఇరు వర్గాలు కృషి చేయాలని కోరింది.