నేడే తీర్పు… ఎన్నికలు ఉంటాయా? ఉండవా?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన సంగతి [more]

;

Update: 2021-01-21 00:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ఎన్నికలు జరపాల్సిందేనని ఎస్ఈసీ తరుపున న్యాయవాదులు వాదించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్నందున ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. దీనిపై ఎలాంటీ తీర్పు వెలువడనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News