రాజధాని పై హైవర్ కమిటీ.. మంత్రివర్గం నిర్ణయం
రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం, అధ్యయనం కోసం జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించిందని, దానిపై అధ్యయనం చేశామని, బోస్టన్ కన్సల్టెంట్ [more]
రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం, అధ్యయనం కోసం జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించిందని, దానిపై అధ్యయనం చేశామని, బోస్టన్ కన్సల్టెంట్ [more]
రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం, అధ్యయనం కోసం జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించిందని, దానిపై అధ్యయనం చేశామని, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదిక చేరాల్సి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేయడానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైపవర్ కమిటీ మార్గదర్శకాలను నిర్ణయిస్తుందన్నారు. నాటి ప్రభుత్వం కలల రాజధానిని నిర్మించాలని 2016లో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిందన్నారు. దీనికి లక్షా పదివేల కోట్లు ఖర్చవుతుందన్నారని, అది ఎప్పటికి పూర్తవుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. నిధులన్నీ రాజధానికి వెచ్చిస్తే నీటిపారుదల ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయగలమని పేర్ని నేని ప్రశ్నించారు. అభివృద్ధి పడకేయక తప్పదన్నారు. విద్య, వైద్య సౌకర్యాలను ఎలా మెరుగుపర్చుకుంటామని ప్రశ్నించారు. రాజధానిపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మూడు రాజధానులపై జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయలేదని, ప్రతిపాదన మాత్రమేనని పేర్నినాని తెలిపారు. రైతుల సమస్య పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు.
పంచాయతీ ఎన్నికలకు…..
పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ లను 412 కొత్త వాహనాలను కొనుగోలు చేయడం కోసం 71 కోట్లను కేటాయిస్తూ మంత్రి వర్గం తీర్మానం చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు 191 మార్కెట్ యార్డులను, 151 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోళ్ల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రతిఏటా పంటలకు మద్దతు ధరను ముందే ప్రకటించి కొనుగోలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించాలని, అందుకోసం స్పెషల్ పర్సస్ వెహికల్ ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. 11,009 కోట్ల అంచనాతో బందరు పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. రామాయపట్నం పోర్టును కూడా 10009 కోట్లతో నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించింది. దుగ్గరాజు పట్నం బదులుగా రామాయపట్నం పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టు పరిధిని కుదించాలని నిర్ణయించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన వారిపై న్యాయనిపుణుల సలహాతో ముందుకు తీసుకెళతామన్నారు.2014 డిసెంబరు 31 ముందు జరిగిన భూముల కొనుగోళ్లపై విచారణ జరిపిస్తామన్నారు.