ప్రకృతి ఒడిలో జల సమాధి.. 60 మంది మృతి.. నేలమట్టమైన ఇళ్లు

ఇటీవల మనకు వర్షాలు బీభత్సవం సృష్టించించగా, తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి. భారీ వరదల..

Update: 2023-08-16 06:07 GMT

ఇటీవల మనకు వర్షాలు బీభత్సవం సృష్టించించగా, తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి. భారీ వరదల కారణంగా జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్లన్ని నేలమట్టమయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తిగా అంధకారం నెలకొంది. ఎటు కూసినా కన్నీళ్లు తప్ప మిగిలిందేమి లేదు. బతికున్నవారిలో ఎవ్వరిని కదిలించినా కన్నీరు మున్నీరవుతున్నారు. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వరదలు, వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం నెలకొంది. ఇప్పటి వరకు 60 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్న తీరు చాలా భయానకంగా ఉంది. హిమాచల్‌లో ఈరోజు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ ఈ చిత్రాలను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. దేవభూమి హిమాచల్‌లోని ఈ విధ్వంసం దృశ్యం మిమ్మల్ని కదిలిస్తుంది. వర్షాల వల్ల సంభవించిన విపత్తుతో ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా హిమాచల్‌లోని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 16న కూడా మూసివేశారు.

విధ్వంసం కారణంగా హిమాచల్‌లో ఆందోళనలు చెలరేగాయి. కొండచరియలు విరిగిపడటంతో స్లాటర్‌ హౌస్‌తో పాటు పలు ఇళ్లు అదుపులోకి వచ్చాయి. కేవలం కొన్ని సెకన్లలోనే భవనం కుప్పకూలింది. భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఆకాశం విధ్వంసంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిమ్లాలోని ఫాగ్లీలో జరిగిన ప్రమాదం తర్వాత శిథిలాల కింద కూరుకుపోయిన బాలికను సజీవంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత ఎస్‌ఎస్‌బీ జవాన్లు బాలికను రక్షించారు.

రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, జవాన్లు, ఇతర సహాయక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కంటినిండా నిద్ర లేకుండా సహాయక బృందాలు అనునిత్యం చర్యలు చేపడుతూనే ఉన్నారు.

24 గంటల్లోనే 60 మంది వరకు మృతి చెందడం కలచివేస్తోంది. ఎక్కడ చూసిన హృదయవిదాకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 621 రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా 12 జిల్లాలకు గురువారం వరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. సిమ్లాలో శివాలయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరుకుంది.

ఇక మండిలో బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చడం కొనసాగుతూనే ఉంది. సుమారు 12 జిల్లాల్లో 857 రహదారులు మూతపడడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సిమ్లాలోని ఫాగ్లీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. 17 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మండీ జిల్లాలో 19 మంది చనిపోయారు.

Tags:    

Similar News