జపాన్ దేశంలో హిందిత్వానికి, హిందూ ఆలయాలకు, సంస్కృతిమి మంచి ఆదరణ, గౌరవం ఉంటుంది. అక్కడ అనేక హిందూ ఆలయాలు కొలువై ఉన్నాయి. అయితే, తాజాగా జపాన్ లోని ఓ నగరానికి హిందూదేవత పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. జపాన్ రాజధాని టోక్యోకి సమీపంలోని ఓ నగరానికి ‘కిచిజోజి’ అని పేరు పెట్టారు. దీని అర్థం ‘లక్ష్మీదేవి ఆలయం’. ఆ నగరంలో లక్ష్మీదేవి ఆలయం ఉన్నందున ఈ పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా జపాన్ కాన్సుల్ జనరల్ టకయుకి కిటగవానే తెలిపారు. బెంగళూరులో ఓ కళాశా స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విషయం వెల్లడించారు. జపాన్ సమాజంపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎప్పటినుంచో తమ దేశంలో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయని, వందల ఏళ్లుగా తాము హిందూ దేవుళ్లను పూజిస్తున్నామని పేర్కొన్నారు. జపాన్ భాషలోనూ తమిళం, సంస్కృతానికి చెందిన 500 పదాలు వచ్చి చేరాయని ఆయన గుర్తు చేశారు.