క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కోట్లు స్వాధీనం

క్రికెట్ బెట్టింగ్ కి హైదరాబాద్ కేంద్రంగా మారింది.. ఐపీఎల్ మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా బెట్టింగ్ పాల్పడుతున్న ముఠా ని పట్టుకున్నారు. రాజస్థాన్ లోని ఏటీఎస్ [more]

Update: 2020-10-12 03:41 GMT

క్రికెట్ బెట్టింగ్ కి హైదరాబాద్ కేంద్రంగా మారింది.. ఐపీఎల్ మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా బెట్టింగ్ పాల్పడుతున్న ముఠా ని పట్టుకున్నారు. రాజస్థాన్ లోని ఏటీఎస్ బృందం హైదరాబాద్ లో ఏడుగురిని అరెస్టు చేసింది.. ఈ ముఠా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యక్తులను నియమించుకుని పెద్ద మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు రాజస్థాన్ ఏ టీ యస్ గుర్తించింది.. ఈ మేరకు ఏక కాలంలో దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాకు సంబంధించి కొందరిని ఏటీఎస్ బృందం అరెస్టు చేసింది.. ముఠాలో కీలక సభ్యులుగా ఉన్న గణేష్ సురేష్, పంకజ్, సత్తయ్య లను పట్టుకున్నారు. ఈ నలుగురు దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏడుగురిని అరెస్టు చేయగా వారి దగ్గర నుంచి 16 కోట్ల రూపాయలు నగదును సీజ్ చేశారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.. ముంబై, రాజస్థాన్, ఢిల్లీ హైదరాబాదులో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా ని పట్టుకోవడం ఇదే ప్రథమం.

Tags:    

Similar News