అలర్ట్ : భారత్ లో ‌H3N2 వైరస్

భారత్ లో మరో వైరస్ పొంచి ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. ‌H3N2 వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.

Update: 2023-03-07 03:37 GMT

భారత్ లో మరో వైరస్ పొంచి ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. ‌H3N2 వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. దేశంలో అనేక మంది జలుబు, జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీనికితోడు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రులన్నీ ఇదే రకమైన లక్షణాలతో చేరే రోగులతో కిటకిటలాడుతున్నాయని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు.

కరోనా తరహాలోగానే...
‌H3N2 వైరస్ లక్షణాలని, అయితే దీనికి యాంటీ బయోటిక్స్ వాడవద్దని చెబుతున్నారు. కరోనా వైరస్ లాగానే ‌H3N2 వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కోరుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే కొత్త వైరస్ బారిన పడతారని వద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాల వ్యాధి గ్రస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు


Tags:    

Similar News