Big Breaking: అల్లు అర్జున్ కు రిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు

Update: 2024-12-13 11:39 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అల్లు అర్జున్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు.ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి అల్లుఅర్జున్ కు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకూ రిమాండ్ విధించింది. 

నాంపల్లి కోర్టు వద్ద...
ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరూ అక్కడకు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే చంచల్ గూడ జైలు వద్ద కూడ భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించాల్సివస్తే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News